Friday, March 29, 2024

అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి : మధు యాష్కీ గౌడ్

అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ… దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిపథ్ వల్ల ఉపయోగం ఉండదన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.

రాకేష్‌ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. ఒన్ ర్యాంక్ ఒన్ ఫెన్షన్ పథకానికి మంగళం పాడేలా నో ర్యాంక్.. నో ఫెన్షన్ పథకం అమలు చేయడంలో భాగంగా అగ్నిపథ్ కేంద్రం తీసుకువస్తోందన్నారు. మిల్ట్రీని ప్రైవేటీకరించడంతో పాటు, సైనిక విభాగాల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చలు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోన కేంద్రం ఈ పథకం తీసుకువస్తోందన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement