Thursday, April 25, 2024

వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ..

తాండూరు : మండలంలోని తాండూరు గ్రామపంచాయితీ కంపోస్టు షెడ్డులో సేంద్రీయ ఎరువు తయారు చేయు విధానంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తడి చెత్త ద్వారా వానపాములతో ఎరువులు తయారు చేయు విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. సేంద్రీయ ఎరువుల తయారీ వల్ల రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రసానిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, ఎంపీడీఓ శశికళ, ఎంపీఓ అక్తర్‌ మోహినోద్దిన్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపిఓ సత్యనారాయణ, సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, మల్టిపర్పస్‌ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement