Saturday, May 8, 2021

వరి కొనుగోలు కేంద్రాలు..

బెల్లంపల్లి : వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చంద్రవెల్లి సహకార సంఘం చైర్మన్‌ చింతం స్వామి అన్నారు. ఆకెనపల్లిలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఆకెనపల్లి, పెద్దదుబ్బ, బుచ్చయ్యపల్లి, లింగాపూర్‌, పాత బెల్లంపల్లి గ్రామాల్లోని రైతులంతా వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పెట్టం రాజమల్లు, కారుకూరి వెంకటేష్‌, ఉప సర్పంచ్‌ రాజ్‌కుమార్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News