Sunday, August 1, 2021

టాక్టర్‌ బోల్తా..ఒకరు మృతి..

తాండూరు : బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జంపం గోపాల్‌ (30) తాండూరు మండలం అచ్చులాపూర్‌ ప్రాజెక్ట్‌ వద్ద బోల్తా పడి మృతి చెందాడు. వివరాల ప్రకారం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జంపం గోపాల్‌ ఇసుక చేరవేస్తుండగా అచ్చులాపూర్‌ ప్రాజెక్ట్‌ వద్ద అదుపు తప్పి పడిపోవడంతో గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాండూరు సీఐ బాబురావు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్‌ కింద ఇరుక్కున్న గోపాల్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుని భార్య జ్యోతి, 5 యేండ్ల కుమారుడు ఉన్నారు. ప్రమాధంపై వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు సీఐ బాబురావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News