Tuesday, November 29, 2022

కుమ్రంభీం జిల్లాలో పులి సంచారం..

తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టించింది. పట్టణంలోని వినయ్‌ గార్డెన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. పులి కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది పులి పాదముద్రలు సేకరించారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పులి జాడను వీలైనంత తొందరగా కనిపెట్టాలని అధికారులు ఆదేశించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement