Thursday, April 18, 2024

పులి సంచారం క‌ల‌క‌లం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గతకొన్ని రోజులుగా పలు గ్రామాల్లో పులి సంచ‌రిస్తుంది. ఆవులు, కుక్క‌లు, గొర్రెల‌పై పులి దాడులు చేస్తుంది. తాజాగా బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. ఇది గుర్తించిన గ్రామ‌స్తులు అట‌వీ
శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఒంట‌రిగా బ‌య‌ట‌కు వెళ్ల‌ద్ద‌ని సూచించారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆదివారం బాబాసాగర్‌ ఏరియా కుంట వద్ద స్థానికులకు పులి కనిపించింది. రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్‌ మండలంలోని వేంపల్లి – అనుకోడ గ్రామ శివారులో పెద్దపులి కొందరు ప్రయాణికులకు కనిపించింది. పులి ఆచూకీ కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement