Sunday, August 1, 2021

స్వచ్చంధంగా లాక్‌డౌన్‌..

బెల్లంపల్లి : స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ను విధించుకొని మనతో పాటు మన విలువై కుటుంబాలను కాపాడుకుందామని బెల్లంపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో బెల్లంపల్లిలో చాలా మంది ప్రముఖులు, యువకులు ప్రాణాలను కోల్పోయారని, మరికొందరి ప్రాణాలను కాపాడాలంటే స్వచ్చందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటే కరోనాను ఎంతో కొంత కట్టడి చేయగల్గుతామని అన్నారు. బెల్లంపల్లి వ్యాపార సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని సంఘాల పెద్దలతో మాట్లాడి మే నెల 4వ తేది నుండి 11వ తేది వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాపార సంస్థలను తెరిచి ఉంచి వ్యాపారం చేసుకోవాలని, 3 గంటల నుండి తమ వ్యాపార సంస్థలను బంద్‌ చేసి స్వచ్చంధ లాక్‌డౌన్‌ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెల్లి రాజలింగు, దామెర శ్రీనివాస్‌, ఎస్‌.కె.అప్సర్‌, కోదండ రామాలయం చైర్మన్‌ రేణికుంట్ల శ్రీనివాస్‌, వ్యాపార సంఘాల నాయకులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News