Friday, October 4, 2024

ADB: చెన్నూరు కోర్టులో స్వచ్చభారత్..

చెన్నూర్, ప్రభన్యూస్ : చెన్నూర్ మన్సిఫ్ కోర్టు ఆవరణలో సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి న్యాయవాదులతో కలిసి ఇవాళ ఉదయం స్వచ్చభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా కోర్టు ఆవరణలో ఉన్న చెత్త చెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు.

ప్రతి ఒక్కరూ తమ నివాస ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టుకున్నట్లయితే సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాంబాబు, కార్తీక్, మహేష్, మల్లేశం గౌడ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement