మంచిర్యాల : ప్రాచీన క్రీడ అయిన కర్రసాము సిలంబంను ప్రాచుర్యంలోకి తీసుకురావడం అభినందనీయమని క్రీడలు నేర్చుకుంటున్న క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి పేర్కొన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ ప్రీడమ్ రన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని సిలంబం క్రీడాకారుల ప్రదర్శనను తిలకించి వారిని అభినందించారు. క్రీడాకారులతో కలిసి కర్రసాము విద్యను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీఓ శ్రీకాంత్ రెడ్డి, సిలంబం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement