Thursday, April 25, 2024

ప్రజల కోసమే పోలీసులు..

బెల్లంపల్లి : ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతీయుత వాతావరణంలో గడిపేలా చూడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి రూరల్‌ సీఐ జగదీష్‌ అన్నారు. నెన్నెల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సరిహద్దు గ్రామాలైన ఖర్జీ, కోనంపేట గ్రామాల్లో సీఐ జగదీష్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ పార్టీ సిబ్బందితో ఏరియా డామినేషన్‌ను నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ జగదీష్‌ మాట్లాడుతూ మావోయిస్టుల నియంత్రణలో భాగంగా ముమ్మర తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలెవరు మావోయిస్టుల సిద్ధాంతాలు నమ్మి వారి బాటలో వెళ్లి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, జీవితాలను కష్టాల పాలు చేసుకోవద్దని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో గడిపేలా చూడటం పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై నిఘా ఉందని, శాంతిభద్రతలకు భంగం కల్గిస్తే కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. సీఐ వెంట నెన్నెల ఎస్సై
రమాకాంత్‌, పోలీస్‌ సిబ్బంది మనోజ్‌, శ్రీకర్‌, కృష్ణ, స్పెషల్‌ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement