Friday, April 19, 2024

రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి..

బెల్లంపల్లి : కేటీకే-6 గనిలో జరిగిన ప్రమాధానికి కారణమైన సంబంధిత గని అధికారులపై హత్యానేరం నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని, రూ.1కోటి నష్ట పరిహారం చెల్లించాలని సింగరేణి ఐక్య గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ డిమాండ్‌ చేశారు. కేటీకే-6 గనిలో 5వ లెవల్‌ వాసిన్‌ వద్ద ప్రమాధం పొంచి ఉందని, మొదటి షిప్టు ఓవర్‌మెన్‌లకు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఉత్పత్తిపై పెట్టిన శ్రద్దను కార్మికుల ప్రాణాలపై పెట్టకపోవడం వల్ల ఇద్దరు అమాయకులైన నర్సయ్య, శంకరయ్యలు ప్రాణాలు విడిచారు. ప్రమాధానికి కారణమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బని రాజేంద్రప్రసాద్‌, నాయకులు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement