Thursday, April 25, 2024

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం..

పెద్దపల్లి : మండలంలోని మారేడుగొండ గ్రామానికి చెందిన నల్లాల రమేష్‌ హైదరాబాద్‌ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధ పడుతుండగా బాధిత కుటుంబానికి గ్రామ ఉద్యోగ సంక్షేమ సంఘం సభ్యులు రూ. 23,716 ఆర్థిక సహాయం అందించారు. రమేష్‌ ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం రమేష్‌, సుందరగిరి శ్రీనివాస్‌, అమినోద్దిన్‌, బుర్ర రాకేష్‌, కారెంగల శ్రీనివాస్‌, గుర్రం నరేష్‌, ఉనుకొండ మహేష్‌, వేగోళపు మధుకర్‌, శ్రీధర్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement