Friday, October 4, 2024

ADB | పొనకల్ వాసికి ఎంబీబీఎస్ లో సీటు..

జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్‌కు చెందిన దుమ్మల నాగమణి ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. నీట్‌లో రాష్ట్ర స్థాయిలో 5864 ర్యాంకు సాధించి నిర్మల్ జిల్లా వైద్య కళాశాలలో సీటు సాధించింది. పొనక్కల్ వాసి దుమ్మల ఎల్లయ్య, సరిత దంపతుల పెద్ద కుమార్తె అయిన ఈమె చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ మంచి మార్కులు సాధించేది.

ఒక‌టి నుంచి 4వ తరగతి వరకు గ్రామంలోని పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో, 5 నుంచి 10వ తరగతి వరకు నిర్మల్‌ కేంద్రంలోని టీఎస్‌ఆర్‌జీసీ(డబ్ల్యూ)లో, ఇంటర్మీడియట్‌ లక్షెట్టిపేటలోని టీఎస్‌ఆర్‌జీసీ(డబ్ల్యూ)లో చదివిన నాగమణి నీట్‌ ర్యాంక్‌ సాధించింది. ఈ మేరకు కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్‌, గ్రామస్తులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement