Monday, October 7, 2024

ADB: మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే బోజ్జు పటేల్..

ఉట్నూర్, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా అందోల్ ఎక్స్ రోడ్ సైనికంలో ఇవాళ‌ బైక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్య‌క్తిని అంబులెన్స్ లోకి ఎక్కించి చికిత్సల కోసం పంపించి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌ బోజ్జు పటేల్ మానవత్వాన్ని చాటుకున్నారు.

ఎమ్మెల్యే ఇస్లాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉండగా, తన వాహనాన్ని ఆపి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో యువకులతో ఎక్కించి పంపించారు. ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకోవడం ఎంతో సంతోషకరమని పలువురు అన్నారు. ఒక హోదా గల వ్యక్తి వాహనాన్ని ఆపి వైద్య చికిత్సలకు పంపించడం సంతోషకరమని పలువురు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement