Saturday, April 20, 2024

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

శ్రీరాంపూర్‌ : ఆర్కే న్యూటెక్‌ గని ఆవరణలో ఆకుల లక్ష్మణ్‌ అధ్యక్షన నిర్వహించిన సమావేశానికి ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి కొట్టె కిషన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై 130వ మేడే వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడి ప్రపంచ కార్మిక వర్గానికి స్పూర్తిని ఇచ్చే రోజు మేడే 1886లో చికాగో కార్మికుల రక్తతర్పణ ఫలితంగా అమలులోకి వచ్చిన 8 గంటల పని విధానానికి స్పూర్తి మేడే అని అన్నారు. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్యగా సాధించుకున్నామని అన్నారు. శనివారం జరిగే మేడే వేడుకల్లో కార్మికుంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా ప్రచార కార్యదర్శి గజ్జి రమేష్‌, ఆకుల లక్ష్మణ్‌, సహాయ కార్యదర్శి మెర్రి సందీప్‌కుమార్‌, నాయకులు శ్రీధర్‌, భీమిని పోచం, కుమార్‌, తిరుపతి, పాషా, మధూకర్‌, దేవేందర్‌, రాయమల్లు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement