Saturday, December 7, 2024

ADB | గోదామును తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ

జన్నారం, ( ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ప్రాథమిక కోఆపరేటివ్ మార్కెటింగ్ కార్పొరేషన్ గోదామును శుక్రవారం మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్త తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గోదాంలోని హాస్టళ్లకు సరఫరా చేసే నిత్యవసర సరుకులను పరిశీలించారు.

సరుకులపై ఉన్న ప్రారంభ, గడువు ముగింపు తేదీలను ఆమె స్వయంగా చూశారు. స్టాక్ రిజిస్టరులో సరుకులను సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ఆమె గోదాము ఇన్చార్జి జె.లక్ష్మన్ ను అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న రేషన్ బియ్యం సేల్స్ పాయింటును ఆమె తనిఖీ చేశారు.ఆమె వెంట స్థానిక మేనేజర్ బి.బాలాజి, సేల్స్ మెన్ ప్రభాకర్ , తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement