Friday, May 7, 2021

గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణం..

హాజీపూర్‌ : మండలంలోని గ్రామాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామపంచాయితీల్లో కరోనా బారీన పడకుండా గ్రామ వీధుల్లో పెద్దఎత్తున హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేస్తున్నారు. పలు గ్రామాల్లో పాజిటీవ్‌ కేసులు నమోదైన ఇండ్లతో పాటు వీధుల్లో సైతం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేశారు. అలాగే పంచాయితీల్లో మురికి కాల్వలను శుభ్రం చేయించి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లడంతో పాటు బోర్‌వెల్‌ను రిపేర్‌ చేయడంతో వీధి దీపాలకు మరమ్మత్తులు చేయిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పల్లె ప్రకృతి వనంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించి పలు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న వ్యవసాయ భూమి అభివృద్ధి పనులను, ఇతర ఈజిఎస్‌ పనులను, గ్రామాల్లో అభివృద్ధి పనులను సర్పంచులు, కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News