Tuesday, March 21, 2023

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముధోల్ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి అన్నారు. బాసర మండలం కిరుగుల్ బి గ్రామంలో ఎన్ఆర్ఈజీసి ద్వారా 10 లక్షలు మంజూరు కాగా మండల నాయకులతో కలిసి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం బీటి రోడ్లు సిసి రోడ్డు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రాజన్న, బైంసా మాజీ ఏఎంసీ చైర్మన్ కృష్ణ, ఎంపిటిసి ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement