Sunday, December 8, 2024

రోడ్డుప్ర‌మాదంలో మాజీ ఎంపీటీసీ దంప‌తులు మృతి

రోడ్డుప్ర‌మాదంలో మాజీ ఎంపీటీసీ దంప‌తులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ మంచిర్యాలలో చోటుచేసుకుంది. మాజీ ఎంపీటీసీ శోభాదేవి దంపతులు ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం ఇందన్ పల్లి వద్ద జన్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవి, ఆమె భర్త మురళీధర్ కలిసి ప్రయాణిస్తోన్న కారు.. ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికవేగమే కారు ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement