Tuesday, April 23, 2024

తెరాస కార్యకర్త కు ఆర్థిక చేయూత.. బాల్క ఫౌండేషన్ ద్వారా రూ 50 వేలు

తెరాస కార్యకర్త కూతురు వివాహానికి చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బాల్క పౌండేషన్ ద్వారా 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం నియోజకవర్గం జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సీనియర్ తెరాస కార్యకర్త గోల్కొండ రవి గౌడ్ గ కుమార్తె వివాహానికి చీర,సారే తో పాటు వివాహ ఖర్చులకు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ జడ్పీటీసీ మేడి సునిత తిరుపతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరవింద రావు, కుందారం సర్పంచ్ ఇజ్జగిరి సమ్మయ్య, ఎంపీటీసీ రాచర్ల సతీష్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తుమ్మలపల్లి రామారావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్, శివారం సర్పంచ్ ఆవిడపు గణేష్ తో పాటు తెరాసా మండల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. వివాహానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement