Monday, December 9, 2024

ADB: అనుమానాస్పద స్థితిలో రైతు మృతి…

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణ శివారులోని అనుకుంట గ్రామానికి చెందిన రైతు అలిశెట్టి సంతోష్ (42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం 4గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లిన సంతోష్ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గ్రామ పరిసరాల్లో అతని కోసం గాలించారు.

తీరా సోమవారం 11 గంటలకు ఓ పంట చేనులో చెట్టు కింద ఉన్న మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. మృతదేహం పక్కన బీరు సీసా, ఆ పక్కనే నైలాన్ తాడు ఉంది. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంతోష్ నడవలేని స్థితిలో అస్వస్థతకు గురై మిస్టరీగా మృతిచెందడం కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement