Sunday, April 11, 2021

ప్రతీ ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్..

బెల్లంపల్లి : కరోనా వైరస్‌ టెస్టులు, కోవిడ్‌ వ్యాక్సిన్‌ పట్టణంలోని షంషీర్‌నగర్‌ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులోకి వచ్చిందని, పట్టణంలోని ప్రతీ వార్డులో ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్‌ వేయించుకుంటే అంత త్వరగా కరోనా వైరస్‌ను అరికట్టవచ్చునని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ అన్నారు. ఈ నెలలో 45 సంవత్సరాల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు మరుసటి నెల 18 సంవత్సరాల వయసు ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశం ఉందని, 45 సంవత్సరాలు ఉన్న ప్రతీఒక్కరికి వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పిస్తూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేలా తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News