Wednesday, April 24, 2024

కరోనాతో మృతిచెందిన తండ్రి, కొడుకు..

మంచిర్యాల : జిల్లాలో కరోనా ప్రమాధకర ఘంటికలు మారుమోగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 110 మందికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి (65), కొడుకు (35) కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత వారం రోజుల క్రితం ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు అనారోగ్యానికి గురి కాగా కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో మామూలు జ్వరం లాగానే భావించి చికిత్స చేయించుకున్నారు. ఎంతకు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో రెండు రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా పాజిటీవ్‌గా నిర్దారణ అయింది. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం జిల్లా కేంద్రంలోని పై#్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బాలాజి పేర్కొన్నారు. జ్వరం సోకిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి కరోనా నిర్దారణ పనులను నిర్వహించుకోవాలని, కరోనా సూచించిన మేరకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ విందులు, వినోదాలకు దూరంగా ఉంటూ అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు సాగించాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. శరామామూలుగానే తీసుకుంటూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement