Monday, April 15, 2024

కోల్‌బెల్ట్‌లో విజృంభిస్తున్న కరోనా..

మంచిర్యాల : జిల్లాలోని కోల్‌బెల్ట్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే కోల్‌బెల్ట్‌లోనే 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకుతోంది. కోల్‌బెల్ట్‌లో ప్రధాన పట్టణలైన బెల్లంపల్లి, మందమర్రి, గోలేటి, శ్రీరాంపూర్‌, సీసీసీ, ఇందారం తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికుల కుటుంబాలనే కాకుండా సామాన్య ప్రజలకు కరోనా సోకుతుండటంతో సింగరేణి కార్మికుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో ఇక్కడి నుండి చికిత్స పొందుతూ అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌కు వెళ్తున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్‌తో మృతి చెందుతున్నారు. గత వారం రోజుల క్రితం బెల్లంపల్లి పట్టణంలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన భార్య, భర్తలు మృతి చెందిన విషయం మరువకముందే గత రెండు రోజుల క్రితం మందమర్రి మండలంలో 5గురు మృతి చెందారు. పట్టణంలోని మార్కెట్‌ ఏరియాకు చెందిన జిల్లెపల్లి రవీంధర్‌ కరోనాతో మృతి చెందాడు. 11 రోజుల క్రితం రవీంధర్‌ తల్లి అనసూయ వైరస్‌తో మరణించింది. కోవిడ్‌ బారీన పడి తల్లి వెంట ఉన్న రవీంధర్‌కు పాజిటీవ్‌ రావడంతో చికిత్స పొందుతూ కరీంనగర్‌లో మృతి చెందాడు. రవీంధర్‌ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె కరీంనగర్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వైరస్‌ బారీన పడి ఒకే ఇంట్లో తల్లి, కుమారుడు మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటం కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో విషాదాన్ని నింపుతోంది. దీంతో కోల్‌బెల్ట్‌ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement