Wednesday, April 14, 2021

సీఎం సహాయనిధి చెక్కులు..

ముత్తారం: మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన పాశం రాజయ్యకు రూ. 13600, షేరు విజయకు రూ. 2300ల చొప్పున మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్‌ పంపిణీ చేశారు. లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ తాత స్వప్న బాలు, వార్డుసభ్యులు చుంచు రమేష్‌, షేర్‌ రమేష్‌ టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్‌, చిందం సదానందం, సింగనవేన కుమార్‌లు పాల్గొన్నారు. అలాగే రామకృష్ణాపూర్‌కు చెందిన ఎడ్ల రాజయ్యకు రూ. 10వేల సీఎం సహాయనిధి చెక్కును సర్పంచ్‌ ఉప్పు సుగుణ శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో తెరాస నాయకులు కొమురయ్య, శ్రీను, సది, సునిల్‌, సంతోష్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News