Friday, February 3, 2023

చిరుత సంచారం క‌ల‌క‌లం.. గొర్రెల మంద‌పై దాడి..

కామారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం క‌ల‌క‌లం రేపింది. చిరుత పులి గొర్రెల మంద‌పై దాడి చేసిన ఘ‌ట‌న ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. సోమర్యాగడి తండాలో చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. ఓ వ్య‌క్తి గొర్రెలను మేతకు మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చిరుత పులి దాడి చేయ‌డంతో స్థానిక గొర్రెల కాపరులు గమనించి ఆరవడంతో పులి పారిపోయింది. వెంట‌నే స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. చిరుత‌ను ప‌ట్టుకునేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ గ్రామంలో బోన్ ఏర్పాటు చేయాలని కోరారు. రెండు రోజుల క్రితం చిరుత పులి రెండు పిల్లలతో సంచారం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement