Thursday, April 25, 2024

బొగ్గు గనుల ప్రైవేటీకరణ వద్దు..

కాసిపేట : దేశ బొగ్గుగనుల ప్రైవేటీకరణ చేసి బడా పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలని ఏఐటీయూసీ ప్రదాన కార్యధర్శి వాసిరెడ్డి సీతరామయ్య పేర్కొన్నారు. మందమర్రి ఏరియా కాసిపేట గనిపై నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానలను అవలంభిస్తన్నదని, కొత్త వ్యవసాయ, కార్మిక చట్టాలను తీసుకువస్తున్నదని తెలిపారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను సైతం నష్టాల పేరుచెప్పి ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టెందుకు చూస్తున్నదని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఇప్పటికే పలు పనులను కంట్రాక్ట్‌దారులకు అప్పగించారని, ఏకంగా బొగ్గు గనులను టెండర్‌ల ద్వారా ఆదాని లాంటి బడావ్యాపారులకు కట్టబెట్టనున్నారని వివరించారు. దాంతో కార్మికుల ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, హక్కులు హరించివేయబడతాయని, కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదమని అన్నారు. మరో వైపు సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదని, రిటైర్డ్‌ కార్మికులకు కంపేనీ నుండి రావాల్సిన ఆర్థిక లావాదేవీలు సమయానికి ఇవ్వడంలేదని, నెలల తరబడి వారిని ఆఫీసుల చుట్టు తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికులు చైతన్యం కావాలని, వాటని అడ్డకునే ఆందోలనలో పాలుపంచుకోవాలని లేకుంటే భవిష్యత్‌లో అనేకసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసి నాయకులు మిట్టపెల్లి వెంకటస్వామి, చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్‌, బియ్యాల వెంకటస్వామి, మీనుగు లక్ష్మినారాయణ, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement