Friday, March 29, 2024

వేసవిలో పక్షులకు నీటి సమస్య రాకుండా చూడాలి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నల్లకుంట, ప్రభన్యూస్‌: వేసవిలో పక్షులకు నీటి సమస్య రాకుండా ప్రతి ఒక్కరు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచించారు. నీటి సమస్యతో ఎన్నో రకాల పక్షులు మృత్యువాతపడుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. శుక్రవారంనాడు బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో పక్షులకు నీళ్ళ తొట్లను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నీళ్ళు అందుబాటులో లేక పక్షులు నీళ్ళు తాగలేక అనేక అవస్థలు పడుతున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి పక్షులు నీళ్ళు తాగడం కోసం తొట్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వేసవి వేడిమి తీవ్ర స్థాయిలో ఉందని మనుషులు కూడా ఎక్కువ నీటిని తాగకపోతే తీవ్ర అనారోగ్యం బారినపడతారని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement