Monday, January 30, 2023

Bike fired: ద్విచక్ర వాహనాల‌కు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

భీంగల్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన బీమర్తి రాజశేఖర్, భీమర్తి రాజేష్ ల‌కు చెందిన బుల్లెట్, ప్యాసన్ ప్రో వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తగలబెట్టారు. వాహనాల యజమాని తన బుల్లెట్ వాహనాన్ని ఎస్బీఐ బ్యాంకు ఎదుట నిలిపి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తి వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి. రెండు వాహనాలు ఒకే కుటుంబానికి చెందిన అన్నాతమ్ములకు చెందినవి. ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన విషయం పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. బయట ఉంచిన వాహనాలను తగలబెట్టడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement