Tuesday, April 23, 2024

నిర్మ‌ల్ లో డివైడ‌ర్ ను ఢీకొన్ని బైక్‌.. ఒక‌రి మృతి..

బైక్ పై డివైడ‌ర్ ను ఢీకొని ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న నిర్మ‌ల్ లో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ద్విచ‌క్ర వాహ‌నం అదుపుత‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం గాయ‌ప‌డిని వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement