Thursday, April 25, 2024

భీమయ్య విగ్రహం ఆవిష్కరణ..

కాసిపేట : మండలం మద్దిమాడ గ్రామంలో చైనేని భీమయ్య విగ్రహాన్ని ఆదివాసీ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడు నాయకులు మాట్లాడుతూ 1989 ఏప్రిల్‌ 24వ తేదిన మద్దిమాడ గ్రామ సమీపంలో అటవీ శాఖ, పోలీస్‌ సిబ్బందికి జరిగిన కాల్పుల్లో చేనైని భీమయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. అటవీ భూములపై సర్వహక్కులు ఆదివాసీలకే దక్కాలని చేసిన ఈ పోరాటంలో అమరుడైన భీమయ్య ఆశయ సాధనకు ఆదివాసీలంతా ఐక్యం కావాలని నాయకులు పేర్కొన్నారు. అంతకుముందు గిరిజనులు సాంప్రదాయ వాయిద్యాలతో గ్రామం నుండి విగ్రహ స్థలం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జెడ్‌పీటీసీ లక్ష్మి, సర్పంచ్‌ బాదు, ప్రజాప్రతినిధులు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేచినేని రాజయ్య, విగ్రహ దాత కొమ్ముల బాపు, ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement