Sunday, October 6, 2024

ADB: విదుల్లో వేధిస్తున్న ఇన్చార్జి సూపరిండెంట్ పై చర్యలు తీసుకోవాలి…

సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగురాలు ఆవేదన
జన్నారం, సెప్టెంబర్ 25 (ప్రభ న్యూస్): విధి నిర్వహణలో డివిజనల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళ ఉద్యోగిపై అదే కార్యాలయంలో ఇన్చార్జి సూపరిండెంట్ గా పనిచేస్తున్న షమీమొద్దీన్ వేధిస్తున్న ఉదంతం ఇది. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజనల్ కార్యాలయంలో ఇన్చార్జి సూపరిండెంట్ గా పనిచేస్తున్న ఎం.డి షమీమొద్దీన్ ఉద్యోగ రీత్యా తనను వేధిస్తున్నాడని అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఠాగూర్ సవిత ఆరోపించారు.

బుధవారం స్థానిక డివిజనల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అతను డివిజనల్ లోని జన్నారం రేంజు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పోస్టింగులో ఉండి, స్థానిక డివిజనల్ కార్యాలయంలో 15 సంవత్సరాలుగా అకౌంటెంట్ సెక్షన్, ఇన్చార్జి సూపరిండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడని ఆమె చెప్పారు. తాను ఇక్కడికి బదిలీపై వచ్చినప్పటి నుంచి ఉద్యోగ రీత్యా విధి నిర్వహణలో వేధిస్తున్నాడని ఆమె తెలిపారు. తాను 19 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్చార్జి సూపరిండెంట్ ఎం.డి షమీమొద్దీన్ ఉద్యోగ రీత్యా వేధిస్తూ తనకు ఇంతవరకు జీతం ఇవ్వ‌లేదన్నారు.

తాను ఉద్యోగ రీత్యా సీనియర్ అయినప్పటికీ తనకు సూపరిండెంట్ బాధ్యతలు ఇవ్వకుండా అతను అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపించారు. ఈ విషయమై మంచిర్యాల ఎఫ్.డి.పి. టి.కి, డీఎఫ్ఓ కు ఈనెల 17న తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. విచారణ జరిపించి ఉద్యోగరీత్యా తనను వేధించిన షమీంపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తనకు జీతం ఇప్పిస్తూ, వేధింపులను గురిచేసిన షమీమును యధాస్థితి బదిలీ చేయాలని, తాను సీనియర్ అయినందున తనకు డివిజన్ కార్యాలయంలో ఇన్చార్జి సూపర్డెంట్ బాధ్యత ఇప్పించాలని ఆమె కోరారు.

- Advertisement -

విషయమై మంచిర్యాల డి.ఎఫ్.ఓ శివ్ ఆశిష్ సింగ్ వివ‌ర‌ణ ఇస్తూ… తమకు మహిళా ఉద్యోగి ఈనెల 17న ఫిర్యాదు చేసిందన్నారు. విచారణ జరిపించి, ఆమె ఆరోపణలు నిజమని తేలితే బాధ్యునిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement