Friday, March 29, 2024

లేబర్‌ యూనియన్‌ అధ్యక్షునిగా కాసర్ల యాదగిరి

బెల్లంపల్లి : బెల్లంపల్లిలోని రోజువారీ కూలీ సంఘం అధ్యక్షునిగా కాసర్ల యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాసర్ల యాదగిరి మాట్లాడుతూ ప్రతీఒక్క లేబర్‌ యూనియన్‌ కార్డు కల్గి ఉండాలని, కొందరు కార్మికులను తీసుకువెళ్తూ యజమాని వద్ద రూ.600 తీసుకొని కూలీలకు రూ.400 ఇస్తూ కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారని, ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కావద్దని కోరుకుంటూ ఈ సంఘం ఆకలితో ఏర్పడిన సంఘమని, హక్కులను సాధించుకోవడానికే తీవ్రతరంగా కృషి చేస్తామని అన్నారు. బెల్లంపల్లి చుట్టుప్రక్కల ఫ్లైఓవర్‌ నిర్మాణాలు, రైల్వే పనులు, హైవే పనుల్లో బెల్లంపల్లి భవన కార్మికులను 30 శాతం వరకు తీసుకోవాలని, ఈ సంఘం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు మద్దతుగా నిలవాలని అన్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకురావడం వల్ల స్థానిక కూలీలకు అన్యాయం జరుగుతుందని, రోజు 500 మంది వస్తూ 300 మంది పని దొరక్కుండా వెనుదిరిగిపోతున్నారని అన్నారు. నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తు కార్యచరణ చేపడుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement