Friday, March 29, 2024

క్రికెట్‌ కిట్‌ పంపిణీ

నెన్నెల : నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో యువకులకు సర్పంచ్‌ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో రూ.5వేల విలువైన క్రికెట్‌ కిట్‌ను క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని, క్రీడాకారుల మధ్య స్నేహ భావం కల్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రంజీత్‌, యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement