Thursday, April 25, 2024

కిక్‌ బాక్సర్‌ రామగిరి జోత్స్నకు ఆర్థిక సహాయం

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని రామగిరి కృష్ణ కూతురు రామగిరి జోత్స్న కిక్‌ బాక్సింగ్‌లో మంచి ప్రతిభ కనబర్చి జమ్మూకాశ్మీర్‌లో జరిగే నేషనల్‌ లెవల్‌కు ఎంపికైంది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ మాట్లాడుతూ నేషనల్‌ లెవల్‌లో రాణించి బెల్లంపల్లికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కౌన్సిలర్‌ దామెర శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement