Monday, March 27, 2023

తెలంగాణ జాగృతి..రక్తదాన శిబిరం

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో లక్ష్మి ప్రసన్న ఆసుపత్రిలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు సిద్ధంశెట్టి సజన్‌ ఆధ్వర్యంలో మెగా రక్తధాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం కళ్యాణి-భీమాగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌లు పాల్గొని రక్తధానం చేసిన దాతలకు డోనర్‌ కార్డులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుకుంటున్నామని అన్నారు. తలసేమియా వ్యాథితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతీ నెలా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, కరోనా సమయంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 100 మంది ముందుకు వచ్చి రక్తధానం చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలో మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సూరం సంగీత, నెల్లి శ్రీలత, పోలు ఉమాదేవి, షేక్‌ అస్మా, టీఆర్‌ఎస్‌ నాయకులు, జాగృతి నాయకులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement