Friday, March 31, 2023

గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

కాసిపేట : కాసిపేట మండలం సోమగూడెం ట్యాంకుబస్తికి చెందిన సంకె శ్రీనివాస్‌ (43) అనే వ్యక్తి గోదావరిలో మునిగి మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం జైపూర్‌ మండలం వేలాల జాతరకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన శ్రీనివాస్‌ ప్రమాధవశాత్తు నీట మునిగాడు. గమనించిన కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన శ్రీనివాస్‌ మృతదేహాన్ని గుర్తించిన గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement