Sunday, November 10, 2024

Crime: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. యువతిపై యాసిడ్ దాడి

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలంలోని లక్కారంలో దారుణం జరిగింది. కేబీనగర్‌లో ఓ యువతిపై దుండగుడు యాసిడ్‌ పోసి పరారయ్యాడు. దీంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement