Friday, October 4, 2024

Accident – గుర్తు తెలియని వాహనం ఢీ – కానిస్టేబుల్ మృతి

తొర్రూర్ టౌన్ సెప్టెంబర్ 27(ప్రభన్యూస్ )గుర్తు తెలియని వాహనం ఢీ కొని వరంగల్ జిల్లా మామూనూరు వద్ద గురువారం అర్ధరాత్రి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన జరిగింది.తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విజయేందర్ వరంగల్ జిల్లా మామునూరు శివారులో రాత్రి పల్సర్ బండి. లేక టాక్టర్ వాహనం ఢీకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -


తోరూర్ పోలీస్ స్టేషన్ నుండి రాత్రి 12 గంటల ప్రాంతంలో వరంగల్ కు టూ వీలర్ పై కానిస్టేబుల్ యుగేందర్ వెళ్తున్న క్రమంలో మామునూరు చెరువు కట్ట దగ్గర గత రాత్రి 01:10 .నిమిషాలకు ఆగి ఉన్న ట్రాక్టర్. గాని అక్కడ మరో పల్సర్ బండి ఉంది దాన్ని గాని ఢీకొనడం తో పరిస్థితి విషమంగా ఉన్న కానిస్టేబుల్ యుగంధర్ ను మామునూరు పోలీసులు మెడికవర్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగా మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement