Thursday, December 5, 2024

ACB Raids – రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల లో సోదాలు

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాలు తదితర విషయాలపై ఆకస్మిక సోదాలు చేస్తున్నారు.ఇక నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును పరిశీలిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మీరు దాడులు చేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుల్లిన పదార్థాలతో ఆహారం వండుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా గతకొన్ని రోజులుగా వసతి గృహాల్లోని విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి తీవ్ర కడుపునొప్పితో చనిపోయిన విషయం కూడా తేలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రభుత్వ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement