Wednesday, November 6, 2024

Rangareddy జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడి – భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు

రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ ఎం.వెంకట భూపాల్ రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. 2 నెలల ముందు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికి జైలుపాలైన విషయం తెలిసిందే.

మంగళవారం మరోసారి మాజీ అదనపు కలెక్టర్ అక్రమాస్తుల ఫిర్యాదుపై అతని ఇంటితో పాటు మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ప్రభుత్వ ధర ప్రకారం ఆయనకు రూ.5.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇందులో రూ.4.19 కోట్ల విలువ చేసే ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఓపెన్ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.30 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ ఏడాది అగస్టు 14న ముత్యంరెడ్డి రైతుకు సంబంధించిన 14 గుంటల స్థలాన్ని ప్రోహిబిటెడ్ నుంచి తొలిగించేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ద్వారా రూ.8 లక్షలు తీసుకుని ఏసీబీ అధికారులు దొరికిపోయి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement