Wednesday, October 4, 2023

గోల్కొండ న‌కిలీ నోట్ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్

హైద‌రాబాద్ లోని గోల్కొండ న‌కిలీ నోట్ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. లంగ‌ర్ హౌస్ లో నివాస‌ముంటున్న ల‌క్ష్మీ అనే మ‌హిళ‌ను న‌కిలీ నోట్లతో సుద‌ర్శ‌న్ బురిడీ కొట్టించాడు. అప్పు అడిగిన ల‌క్ష్మీకి న‌కిలీ క‌రెన్సీ ఇవ్వాల‌ని ప్లాన్ చేశాడు. సుద‌ర్శ‌న్ సినిమాల్లో ఫేక్ క‌రెన్సీని స‌ప్ల‌య్ చేస్తుంటాడు. అఫ్జ‌ల్ గంజ్ లో 2కోట్ల ఫేక్ క‌రెన్సీని కొన్నాడు సుద‌ర్శ‌న్. అయితే ప‌క్కా స‌మాచారంతో పోలీసులు సుద‌ర్శ‌న్ ను ప‌ట్టుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా గతంలో కూడా సుదర్శన్ నకిలీ కరెన్సీ తరలిస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement