Sunday, September 24, 2023

Big Breaking | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం.. షోరూమ్​లో 50కార్లు దగ్ధం

హైదరాబాద్​లో ఇవ్వాల (మంగళవారం) రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఎల్బీనగర్​లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ముందుగా ఓ గోదాంలో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇలా పక్కనే ఉన్న పాత కార్ల గ్యారేజీకి వ్యాపించినట్టు తెలుస్తోంది.  పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 50 కార్లకు పైగా తగలబడ్డట్టు తెలుస్తోంది. 

- Advertisement -
   

ఈవిషయం తెలుసుకున్న ఫైర్​ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలార్పుతున్నారు. భారీ శబ్దాలతో గ్యారేజీలోని కార్లు తగలబడుతున్నాయి. కారు ఓ మెన్​ కారు గ్యారేజీకి మంటలంటుకోవడంతో కార్లు దగ్ధం అవుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ఇళ్ల వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement