Thursday, April 25, 2024

మైనర్ బాలిక పై 70ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నం…

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై సుమారు 70యేండ్ల వ్యక్తి గల ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు సమాచారం. ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టడం ఒకింత చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారయత్నం చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement