Saturday, April 20, 2024

Crime: కీచక రచయిత.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

హైదరాబాద్ లోని మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగంది. 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిల ప్రకారం.. సుజాత లా పబ్లిషింగ్‌ హౌస్‌ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్‌ధామ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్‌ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరు కలిసి మీర్‌పేట పీఎస్‌ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉండేవాళ్లు. ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్‌ చేస్తుండేది.

ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ బాధితురాలి ఇంటికి వెళ్తుండేవాడు. గతేడాది డిసెంబర్‌లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న వీరారెడ్డి అక్రమంగా చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు వీరారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి తల్లిని బెదిరించాడు. తనను వేధిస్తున్నారని పేర్కొంటూ నాన్‌–జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లపై వివరాలు రాసి బాధితురాలి తల్లి, ఆమె మేనమామకు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడి నుంచి రెండు నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు, స్కూటర్, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement