Thursday, April 18, 2024

తెలంగాణలో కొత్త‌గా 5892 మందికి క‌రోనా పాజిటివ్ – 46 డెత్స్

హైదరాబాద్‌, : రాష్ట్రంలో కరోనా మరణ మృ దంగం కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్‌ కేసులు కాస్తా తగ్గుతున్నా… మరణాలు మాత్రం తగ్గడం లేదు. తాజా గా గురువారం ఒక్కరోజే 46 మంది కరోనాతో మృతిచెందారు. బెల్లంపల్లిలో 24 గంటల్లోనే 11 మంది కరోనాతో మృతి చెం దడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చెబుతోంది. కాగా మరో 5892 మందికి కరోనా మహమ్మారి సోకింది. అయితే ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో కరోనా కాస్తా తగ్గు ముఖం పడుతుందని ఐఐటీ కాన్పూర్‌ యూ నివర్సిటీ ఆధ్య యనం తేల్చింది. కరోనా చికిత్సల పేరు తో ప్రయివేటు ఆసుప త్రుల దోపీడీ ఆగడం లేదు. లక్షల అడ్వాన్సు చెల్లించినా చాలా ఆసుపత్రుల్లో ఆక్సి జన్‌ సరిపడినంత అందు బాటులో లేదు. దీంతో రోగులకు ఆక్సిజన్‌ సరఫరాను వైద్యులు నిలిపి వేస్తు న్నారు. ఫలితంగా కరోనా రోగులు ప్రాణాలు విడుసు ్తన్నారు. రాష్ట్రం లో వ్యాక్సిన్‌ కొరత రోజు రోజుకు రోజు తీవ్ర మవు తోంది. కోవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా వ్యాక్సిన్‌ దొర కని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొర త ను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిం ది. జిల్లా ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లను పంపుతోంది.
పెరుగుతున్న మరణాల రేటు
కరోనా మరణాల రేటు తెలంగాణలో పెరుగుతోంది. రెం డు రోజుల క్రితం వరకు మరణాల రేటు 0.50శాతంగానే ఉంది. కాని ప్రతీ రోజూ 50కి తగ్గకుండా రోగులు కరోనాతో మృ త్యవాత పడుతుండడంతో డెత్‌ రేట్‌ 0.54శాతానికి పెరిగింది. అయితే జాతీయ సగటు కోవిడ్‌ మరణాల రేటు కంటే తెలం గాణ కరోనా డెత్‌ రేట్‌ తక్కువగానే ఉంది. జాతీయ స్థాయిలో 1.1శాతం కరోనా మరణాల రేటు ఉండగా… తెలంగాణలో 0.54శాతంగా నమోదైంది.
హైదరాబాద్‌తోపాటు సమీప జిల్లాల్లో కరోనా ప్రమా దకరంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో రోజువారీగా నమో దవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 60వాతం జీహెచ్‌ఎంసీతోపాటు పరిసర మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనే నమోదవు తున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీతోపాటు ఈ మూడు జిల్లాలు కరోనా హాట్‌ స్పాట్లుగా మారాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో5892 మందికి సోకిన మహమ్మారి…
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తం గా5892 మందికి కరోనా సోకింది. తాజా కేసులను కలుపుకుంటే రాష్ట్రం లో ఇప్ప టి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4, 81, 640 కు చేరు కుంది. కోలుకోవడంతో గురువారం 9122 మంది కరోనా రోగులు డిశ్చార్జి అయ్యా రు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4, 05, 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గురువారం 46 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్యను కలుపుకుంటే ఇప్పటి వర కు రాష్ట్రంలో 2625 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
ఆగని ప్రయివేటు ఆసుపత్రుల దోపీడీ
కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వ, ప్రయివేటు అన్న తేడా లేకుండా ఆసుపత్రుల్లో అక్రమ వసూళ్ల దందా కొన సాగుతోంది. కరోనాతో ఆసుపత్రుల్లో అడుగుపెట్టిన తర్వాత ప్రాణాలతో బయటపడితే ఒక రేటు… చనిపోతే డెడ్‌బాడీకి ఒక రేటు అన్నచందంగా వసూళ్లు కొనసాగు తున్నాయి. కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రి సిబ్బంది రాంబందుల్లా పీక్కు తింటున్నారు. తాజాగా ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కరోనా మృతదేహాన్ని ప్యాక్‌ చేసేందుకు డబ్బు లు డిమాండ్‌ చేశారు. రూ.4వేలు ఇస్తే కాని మృతదేహాన్ని ప్యాక్‌ చేసేదిలేదని స్పష్టం చేశారు. అంత ఇచ్చుకోలేమని చెప్పినా కనికరించ కుండా ముక్కుపిండి వసూలు చేశారు. రూ.4వేలు ఇచ్చాకే మృతదేహాన్ని ప్యాక్‌ చేసి, అంబులెన్స్‌ వద్దకు తరలించారు.
మూడు రోజులకే రూ.1.70 లక్షల బిల్లు… అయినా దక్కని ప్రాణం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా చికిత్సల పేరిట ప్రయివేటు ఆసుపత్రుల దోపీడీ అడ్డూ అదుపులేకుండా కొన సాగుతోంది. తాజాగా తుంబే ఆసుపత్రి యాజమాన్యం మూ డు రోజుల కరోనా చికిత్సకు గాను లక్షా 70వేల బిల్లు వేసింది. అయినప్పటికీ బాధితురాలు మృతిచెందింది. అధిక బిల్లు వేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా బారిన పడిన తమ వారిని బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు లక్షలకు లక్షలకు చెల్లించినా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత కారణంగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. లక్షల రూపాయలు అడ్వాన్సుగా తీసుకుంటున్న కొన్ని ప్రయి వేటు/కార్పోరేటు ఆసుపత్రులు రోగి పరిస్థితి విషమించేసరికి ఆక్సిజన్‌ లేదంటే చేతులెత్తేస్తున్నాయి. నిలదీస్తే ఆక్సిజన్‌ అం దించినా గుండెపోటుతో మరణిస్తున్నారని చెప్పి తప్పిం చుకుంటున్నాయి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు తగినన్ని లేకపోవడంతో పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి ప్రాణవాయువునే ఐసీయూ పేషెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈలోపు బాధితుల పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement