Wednesday, April 24, 2024

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు తరలిస్తున్న నలుగురి అరెస్టు

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహెరా తాలూకా దామరంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారంపేటలో మావోయిస్టులకు పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోకరి కోసం గాలిస్తున్నారు. అహెరి ఎస్ఐ సచిన్ దోడకే వివరాల ప్రకారం.. బంగారంపేట్ పేలుడు పదార్థాలు ఉన్నాయనే పక్కా సమాచారంతో క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీం) బృందం సహాయంతో ఓ ఇంట్లో దాడిచేశారు. నిల్వ ఉంచిన పది కార్టెక్స్ వైరు బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కాశీనాథ్ అలియాస్ రవి ముల్లగావడే(24), సాధు లచ్చతలండి (30) లతోపాటు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్, ఎన్టీఆర్ కాలనీలకు చెందిన రాజగోపాల్ సల్ల(31), మహ్మద్ కాశిం షద్దుల్లాలను అదుపులోకి తీసుకున్నారు.

బంగారాంపేటకు చెందిన చోటు అలియాస్ శీను ముల్లగావడే తప్పించుకున్నాడు. ఈ కార్డెక్స్ వైర్లను బీజీఎల్, హ్యాండ్ గ్రనైడ్, ఇతర బాంబులు తయారు చేసేందుకు వినియోగిస్తున్నట్లు వారు వివరించారు. బంగారాంపేటకు చెందిన చోటు అలియాస్ శీను ముల్లగావడే తప్పించుకున్నాడు. ఈ కార్డెక్స్ వైర్లను బీజీఎల్, హ్యాండ్ గ్రనైడ్, ఇతర బాంబులు తయారు చేసేందుకు వినియోగిస్తున్నట్లు వారు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement