Tuesday, April 16, 2024

353 మంది మందుబాబులకు జైలు శిక్ష

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేశారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‎లో పట్టుబడ్డ 353 మందికి జైల్ శిక్ష పడింది. డ్రండ్ అండ్ డ్రైవ్ కేసులను విచారణ జరిపిన కోర్టు.. ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించింది.

నగరంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు.. కూకట్‎పల్లిలో 79, మియాపూర్ 60, మాదాపూర్ 41, బాలానగర్ 49, రాజేంద్రనగర్ 30, శంషాబాద్ 24, గచ్చిబౌలిలో 50 మంది మందు బాబులకు జైలు శిక్ష పడింది. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‎కు ఆర్‎టీవో అధికారులకు పోలీసులు లేఖను పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement