Friday, February 3, 2023

ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్…..డి ఎ 2.73 శాతం పెంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. కరువు భత్యం (డీఏ) 2.73 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసు కున్నారు. ప్రస్తుతం ఉన్న 17.29 డీఏ శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ సోమవారం ఆర్థికశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2021 జులై నుంచి అమలు కానుంది. ఆ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ మొత్తాన్ని ఆర్థికశాఖ ట్రెజరీలకు విడుదల చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. జనవరి పెన్షన్‌తో కలిపి పింఛనుదారులకు ఫిబ్రవరిలో డీఏ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 2021 జులై నుంచి 2022 డిసెంబర్‌ నెలఖారు వరకు డీఏ మొత్తాన్ని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. గత కొంత కాలంగా ఉద్యోగుల ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వారికెంతో ఉపశమనం కలిగించిందని తెలిపారు.

- Advertisement -
   


డీఏ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతులను సమర్పించారు. అయితే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నికల సంవత్సరం కావడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. సీఎం ఆదేశాలు, ఆ వెంటనే అధికారులు ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు కూడా షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుడల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement