Thursday, September 23, 2021

ఈత కోసం వెళ్లి బాలుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  తంగళ్ళపల్లి మండలం అంకుశాపూర్ గ్రామ శివారులోని సండ్ర వాగు లో ఈత కోసం వెళ్లి  బాలు (12) అనే ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పద్మనగర్ కు చెందిన బాలు ,అదే గ్రామానికి చెందిన నలుగురి స్నేహితులతో కలిసి శనివారం ఉదయమే గ్రామ శివారులోని సండ్రా వాగులో ఈత కోసం వెళ్ళారు. మొదట నీటిలో దిగిన బాలు మునిగిపోవడంతో తోటి వచ్చిన నలుగురు స్నేహితులు భయాందోళనతో గ్రామానికి వెళ్లి విషయం చెప్పారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సండ్ర వాగు చేరుకున్నారు. మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News